Shilpa Shirodkar About Mahesh Babu : బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ దృష్టిలో మహేశ్ బాబు అసలు సూపర్ స్టారే కాదంటున్నారు. ఆయన ఒక సింపుల్ మ్యాన్ మాత్రమేనిని తాజాగా ఆమె వెల్లడించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ రియాలిటీ షో బిగ్ బాస్ 18లో శిల్పా కంటెస్టెంట్ కాబోతుండటం వల్ల ఆమె చెప్పిన ఈ మాటలు నెట్టింట కాస్త వైరల్ అవుతోంది. అయితే ఆమె ఎందుకిలా అన్నారంటే?
ఇంతకీ శిల్పా శిరోద్కర్ ఎవరంటే?
శిల్పా శిరోద్కర్ స్వయానా మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌కు చెల్లి. తనకు సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం ఒక ఫ్యామిలీ మెంబర్ మాత్రమేనని స్టార్ హీరోలా తానూ ఉండరని, తామూ ఫీల్ అవ్వమంటూ చెప్పి షాకిచ్చారు. ఆ రిలేషన్ కూడా ఎలా ఉంటుందంటే, తన చెల్లి నమ్రతా కంటే ఎక్కువగా పాటు ఎక్కువగా మహేశ్‌తోనే బాండింగ్ ఉంటుందట. ఓ ప్రముఖ మీడియాకు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పారు.
"మహేశ్ ప్రతి ఒక్కరికీ ఒక సూపర్ స్టార్ కావొచ్చు. కానీ, నాకు కాదు. నాకు కేవలం మరిది మాత్రమే. నా చెల్లి కంటే ఎక్కువగా మాకు హెల్ప్ చేస్తుంటారు. మా బాండింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు మేమంతా ఫ్యామిలీ. మా పేరెంట్స్ చనిపోయాక కుటుంబ బాధ్యతలన్నీ నమ్రతానే తీసుకుంది. ఆమె మా అందరికీ ఒక పిల్లర్ లాంటిది" అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కుటుంబం విషయానికొచ్చేసరికి తన ఫేమ్, సక్సెస్‌లను పక్కకుబెట్టి చాలా సింపుల్‌గా ఉంటారట మహేశ్.
ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 18లో శిల్పా శిరోద్కర్ ఎంట్రీపై ఒక ప్రోమో రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పార్టిసిపేట్ చేయడమనే కల ఇప్పుడు నెరవేరబోతుందంటూ ఒక మిస్టీరియస్ వాయీస్గా ఆమెను పరిచయం చేస్తున్నారు. ఆ ఆడియోలో "నన్ను ప్రేక్షకులంతా 90's రాణి అని పిలుస్తుంటారు. నను అప్పటి పెద్ద హీరోలందరితో కలిసి పనిచేశాను. అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, గోవిందా, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్ లాంటి వాళ్లందరితో యాక్ట్ చేశాను. సల్మాన్ ఖాన్‌తో పని చేయాలనే కల ఇప్పటికి నెరవేరుతుంది" అంటూ చెప్పుకొచ్చారు. అయితే అందులో ఆమె మొహం క్లియర్‌గా కనపడకపోయినప్పటికీ కొందరు నెటిజన్లు మాత్రం ఇది శిల్పా శిరోద్కరే అంటూ కనిపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు.
పవన్, మహేశ్ ఎవరి సినిమాలో నటిస్తారు? - ఖుష్బూ ఏం చెప్పారంటే? - Actress Kushboo Sundar