ETV Bharat / snippets

'కేసీఆర్ కనిపించడం లేదు - ఎక్కడున్నా వెతకి పెట్టండి'

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Ex CM KCR Missing Police Complaint
Police Complaint On Ex CM KCR (ETV Bharat)

Police Complaint On Ex CM KCR : మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఎక్కడున్నా వెతకాలంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్​లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు కార్యకర్తలతో కలిసి గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు సీఎంగా ఉండి గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండని కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా గజ్వేల్ ఎమ్మెల్యేగానైనా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలన్నారు. ఈ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పది రోజుల్లో పోలీసులు వెతికి పట్టుకోకుంటే, తామే ఆయన ఆచూకీ కోసం వెతకడం ప్రారంభిస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.