ETV Bharat / state

గవర్నమెంట్​ స్కూల్​ స్టూడెంట్స్​కు ఫ్రీ టూర్​ - తెలంగాణ సర్కార్​ బంపర్ ఆఫర్! - Free Tour for Telangana Students - FREE TOUR FOR TELANGANA STUDENTS

కొత్త ప్రాంతాలు పర్యటించాలన్న ఆసక్తి మెండుగా ఉన్న విద్యార్థులకు శుభవార్త - ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాల సందర్శన - నాలుగు విభాగాలుగా రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు

Students Free Tour Scheme
Free tour scheme for Telangana students (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 7:04 PM IST

Free Tour Program for Govt Students in Telangana : ఉరిమే ఉత్సాహం, సరికొత్త ప్రాంతాలు పర్యటించాలన్న ఆసక్తి మెండుగా ఉన్న స్టూడెంట్స్​కు శుభవార్త. తెలంగాణ సర్కార్​ పాఠశాల స్థాయి విద్యార్థులకు పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ‘తెలంగాణ దర్శిని’ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాఠశాల స్థాయిలో రెండో తరగతి నుంచి డిగ్రీ విద్యార్థుల వరకు వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 12.10 కోట్లు రిలీజ్​ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గవర్నమెంట్​ పాఠశాలలు, కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమం కింద చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.

ఉమ్మడి జిల్లాకు రూ. 36 లక్షలు : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని రేవంత్​ సర్కార్​ భావిస్తోంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులు పర్యాటక ప్రాంతాలను ఆనందంగా సందర్శించటమే లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్యను అనుసరించి, నిధులను త్వరలో ఖరారు చేయనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 3 వేల మంది విద్యార్థులు టూరిస్ట్​ ప్లేస్​లను సందర్శించేందుకు రూ.36 లక్షలు కేటాయించే అవకాశం ఉంది.

దసరా తర్వాత 'దర్శిని'కి శ్రీకారం : విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లి, వారికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఎకో టూరిజం, ఆర్ట్, క్రాఫ్ట్, వారసత్వం, సాంస్కృతిక, చారిత్రక, శాస్త్రీయ ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను సందర్శించేలా ప్లాన్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దసరా సెలవులు ముగిసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తరగతుల వారీగా విభాగాలు : విద్యార్థులు చదువుతున్న తరగతులను పరిగణనలోకి తీసుకొని నాలుగు సెక్షన్​లుగా విభజించారు. మొదటి విభాగంలో 2 - 4 తరగతుల స్టూడెంట్స్​ను గ్రామం లేదా మండల పరిధిలోని స్మారక చిహ్నాలు, వారసత్వ ప్రదేశాలు, ఉద్యానాలను సందర్శించేలా ప్రణాళికలు రెడీ చేసుకోవాలి. రెండో విభాగంలో 5 - 8 క్లాసుల విద్యార్థులు 20 కిలీమీటర్ల నుంచి 30 కి.మీ. పరిధిలోని ప్రదేశాలను విజిట్​ చేసేందుకు అవకాశం కల్పించారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ అభ్యసించే విద్యార్థులకు 50-70 కి.మీ. పరిధిలో ఉన్న ప్రదేశాలను రెండు రోజుల పాటు సందర్శించవచ్చు. డిగ్రీ విద్యార్థులు నాలుగు రోజుల పాటు పర్యాటక ప్రదేశాలను చుట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. సొంత జిల్లా వెలుపల లేదా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా పర్యటించి టూరిజాన్ని సందర్శించేందుకు అవకాశం కల్పించారు.

వారసత్వ సంపద కాపాడుకుందాం : తెలంగాణ దర్శిని కార్యక్రమం రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోనున్నారు. వారసత్వ సంపదను కాపాడుకోవడంలో భాగస్వాములు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వ విడుదల చేసిన గైడ్​లైన్స్​ ప్రకారం జిల్లాలోని విద్యార్థులు పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు.

ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్న అనంతగిరి అందాలు - సెలవుల్లో వెళ్లాల్సిందే మరి - Attractive Tourism in Ananthagiri

ప్రకృతి ఒడి పిలుస్తోంది - అందాల కనువిందుకు ఆహ్వానిస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా - Adilabad Tourist Places

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.