national

ETV Bharat / snippets

ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన నీరో జగన్ : లంకా దినకర్ - Lanka Dinakar On Aarogyasri Issue

Aarogyasri Services to Stop in AP Jagan Government
Aarogyasri Services to Stop in AP Jagan Government (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 5:21 PM IST

BJP Leader Lanka Dinakar Comments On Aarogyasri Issue :ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్‌దేనని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన నీరో జగన్ అంటూ మండిపడ్డారు. ఆసుపత్రులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు 1500 కోట్ల రూపాయలలో 1400 కోట్లు జగన్‌, తన అస్మదీయులకు తరలించారని ఆరోపించారు. ఆసుత్రులలో ఆరోగ్యశ్రీని నిలిపివేయటం వైఎస్సార్సీపీ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. పేదల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ నిధులు సైతం పక్కదారి మళ్లించారంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో లంకా దినకర్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details