Bank Manager Arrest in Nizamabad : బ్యాంక్ ఖాతాదారులకు నమ్మించి రూ.కోట్లు కొట్టేసి పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్‌ను ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. నగరంలోని బడా బజార్లో ఉన్న యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అజయ్‌పై గత నెల 16న ఖాతాదారులు నాల్గో ఠాణాలో ఫిర్యాదు చేశారు.
రూ.కోట్లు కొట్టేసి పరారైన బ్యాంక్ మేనేజర్ - ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
Published : Aug 2, 2024, 3:42 PM IST
Bank Manager Arrest in Nizamabad (ETV Bharat)
విషయం తెలుసుకున్న బ్యాంక్ అధికారులు విచారణ చేసి నిబంధనలు అతిక్రమించాడని అదే నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరారీలో ఉన్న బ్యాంక్ మేనేజర్‌ను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. చివరకు బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.