national

ETV Bharat / snippets

ఇసుక అక్రమ రవాణా కట్టడికి జీపీఎస్ - చెక్‌పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలు

Free_Sand_Policy
Free Sand Policy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 7:23 PM IST

AP Govt GO On Free Sand Policy: ఉచిత ఇసుక పాలసీలో సీనరేజ్‌ ఫీజు మాఫీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు. ఇసుక పాలసీపై ఈనెల 21న భేటీలో నిర్ణయాలు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎటువంటి రుసుము చెల్లించకుండా నిర్మాణ అవసరాలకు ఇసుక తీసుకెళ్లేలా ఆదేశాల్లో స్పష్టం చేసింది.

సీనరేజ్‌ ఫీజు, మెరిట్ ఆన్ శాండ్, డీఎంఎఫ్ మాఫీకి చర్యలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇసుక లభ్యతను పెంచేలా ప్రస్తుత ఇసుక పాలసీలో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక లభ్యం కానీ జిల్లాల్లో స్టాక్ యార్డుల ఏర్పాటు చేయాలని సూచించింది. విజిలెన్స్ మానిటరింగ్​పై విధివిధానాలు మార్పులు చేసింది. ఇసుక అక్రమంగా తరలి పోకుండా జీపీఎస్, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట తనిఖీలకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది.

ABOUT THE AUTHOR

...view details