Diwali Credit Card Offers 2024 : దీపావళి షాపింగ్ కోసం సిద్ధమవుతున్నారా? పండగకు బంగారు, వెండి ఆభరణాలు, కొత్త దుస్తులు, సెల్‌ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు సహా, ఇంటికి కావాల్సిన కిరాణా సరకులు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు- తమ క్రెడిట్ కార్డులపై దీపావళి, ధంతేరాస్ స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. వీటిని ఆన్‌లైన్‌లోనే కాదు, ఆఫ్‌లైన్‌లోనూ వాడుకోవచ్చు. మరెందుకు ఆలస్యం ఏ క్రెడిట్ కార్డ్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో? ఓ లుక్కేద్దాం రండి.
SBI Bank Credit Card Offers :
- ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు యూజర్లు ఐఫోన్ కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 28 వరకు ఉంటుంది.
- దీపావళికి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై బంపర్ ఆఫర్స్ అందిస్తున్నారు.
- ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి సెంకో గోల్డ్ జువెల్లరీ షాప్‌లో బంగారు, వజ్రాల ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. కనీసం రూ.40,000 ట్రాన్సాక్షన్ చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ విధంగా గరిష్ఠంగా రూ.7,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
- తనిష్క్ స్టోర్లలో రూ.80,000 విలువైన లావాదేవీలు చేస్తే, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై రూ.4,000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ దొరుకుతుంది.
- Lalchnd Jewellers దగ్గర కనీసం రూ.40,000 విలువైన ఆభరణాలు కొంటే, రూ.4,000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇస్తారు. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 30 వరకు మాత్రమే ఉంది.
- దీపావళి సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫ్లిక్‌కార్ట్‌లో ఏ వస్తువు కొన్నా 10 శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ICICI Bank Credit Card Offers :
- ఐసీఐసీఐ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డులపై దీపావళి ఆఫర్ కింద జియో మార్ట్, జొమాటో, స్విగ్గీ, జ్యువెలరీ షాపింగ్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది.
- ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లు 2024 డిసెంబర్ 31 వరకు ప్రతి మంగళవారం జియో మార్ట్‌లో షాపింగ్ చేసి ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. కనీసం రూ.2,500 విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే రూ.500 వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ ఆఫర్ కేవలం కిరాణా సామగ్రికి మాత్రమే వర్తిస్తుంది.
- జొమాటోలో రూ.599 కంటే ఎక్కువ విలువైన ఫుడ్ ఆర్డర్ పెడితే, రూ.50 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ వారాంతపు ఆఫర్ శుక్రవారం నుంచి ఆదివారం వరకు మాత్రమే ఉంటుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు హోల్డర్లు CULINARYTREATDEL అనే కూపన్ కోడ్‌ను, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు ఉన్నవారు ICICIAPAYNEW అనే కూపన్ కోడ్‌ను వాడాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం 2024 అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- ఇక స్వీగ్గీలో కనీసం రూ.649 వరకు ఫుడ్ ఆర్డర్ పెడితే రూ.50 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంటేకాదు రూ.1,000 విలువైన ఆర్డర్ పెడితే 10 శాతం డిస్కౌంట్ (గరిష్ఠంగా రూ.150 వరకు) డిస్కౌంట్ దొరుకుతుంది. ఇందుకోసం ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో పాటు, డెబిట్ కార్డు కూడా వాడవచ్చు.
- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లు బంగారం, వెండి ఆభరణాల కొనుగోలుపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు. సూరత్ డైమెండ్ జ్యువెలరీలో కనీసం రూ.2,000 విలువైన ట్రాన్సాక్షన్ చేస్తే 20 శాతం వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇందుకోసం మీరు ఐసీఐసీఈ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన కూపన్ కోడ్‌ను వాడాల్సి ఉంటుంది. ఈ బంపర్ ఆఫర్ 2027 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.
- ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి, ఐఫోన్ 16ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.6,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ 2024 నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
Axis Bank Credit Card Offers :
- యాక్సిస్ క్రెడిట్ కార్డు యూజర్లు త్రిభోవందాస్ భీమ్‌జీ జవేరీ స్టోర్‌లో రూ.50,000 వరకు షాపింగ్ చేస్తే రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రూ.99,999 వరకు షాపింగ్ చేస్తే రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఈ ఆఫర్ నంబర్ 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- యాక్సిస్ కార్డు హోల్డర్లు మెలోర్రా డైమెండ్ జ్యువెలరీ షాప్‌లో రూ.25,000 విలువైన ఆభరణాలు కొంటే రూ.1,800 వరకు డిస్కౌంట్ ఇస్తారు. రూ.40,000 విలువైన నగలు కొంటే రూ.3,000 వరకు, రూ.90,000 విలువైన జ్యువెలరీ కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు డిస్కౌంట్ అందిస్తారు.
- రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, జియోమార్ట్ సిగ్నేచర్ స్టోర్‌ల్లో యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించి కనీసం రూ.15,000 విలువైన కొనుగోళ్లు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఆఫర్ నవంబర్ 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉపయోగించి, అమెజాన్‌లో మొబైల్ ఫోన్స్, గ్రోసరీస్ లాంటివి కొనుగోలు చేస్తే, 10 శాతం డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఆఫర్ అక్టోబర్ 29 వరకు మాత్రమే ఉంటుంది. మింత్రాలో షాపింగ్ చేస్తే రూ.250 వరకు డిస్కౌంట్ అందిస్తారు.
- యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగించి జొమాటో, స్విగ్గీల్లో మినిమం రూ.749 విలువైన ఫుడ్ ఆర్డర్ పెడితే 10 శాతం వరకు (గరిష్ఠంగా రూ.100) డిస్కౌంట్ ఇస్తారు. రూ.3,000 విలువైన ఫుడ్ ఆర్డర్ పెడితే 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తారు.
HDFC Bank Credit Card Offers :
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు Travelxp ద్వారా దేశీయ విమాన టికెట్లు బుక్ చేసుకుంటే 15 శాతం (గరిష్ఠంగా రూ.1,300) వరకు; అదే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే 15 శాతం (గరిష్ఠంగా రూ.5,000) వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
- హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో పేమెంట్ చేస్తే, నగరాల్లోని ప్రసిద్ధ రెస్టారెంట్లలో చేసే భోజనంపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
దీపావళి షాపింగ్ చేయాలా? ఈ 6 స్మార్ట్ టిప్స్‌తో - బోలెడు డబ్బులు ఆదా చేసుకోండిలా!
బిజినెస్ క్రెడిట్ కార్డ్ Vs పర్సనల్ క్రెడిట్ కార్డ్ - ఏది బెస్ట్ ఆప్షన్?