Gummadikaya Dappalam Recipe : చాలా మంది గుమ్మడికాయతో సాంబార్, హల్వా, కూర వంటి రకరకాల వంటలను ప్రిపేర్ చేస్తుంటారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుమ్మడికాయతో ఏ రెసిపీ చేసినా రుచి చాలా బాగుంటుంది. అయితే, గుమ్మడికాయతో ఎప్పుడూ ఒకేలా కాకుండా.. ఈసారి పాతకాలం పద్ధతిలో 'గుమ్మడికాయ దప్పళం' ట్రై చేయండి. ఇలా దప్పళం చేస్తే ఒకటికి రెండు ముద్దలు అన్నం ఎక్కువే తింటారు. ఈ దప్పళం వేడివేడి అన్నం ముద్దపప్పు, నెయ్యితో టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా గుమ్మడికాయ దప్పళం ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- గుమ్మడికాయ ముక్కలు- 2 కప్పులు
- ఉల్లిపాయలు- 2
- ఎండుమిర్చి- 2
- పసుపు- అరటీస్పూను
- కారం- 2 టీస్పూన్లు
- కరివేపాకు- 2 రెబ్బలు
- ఆవాలు- టీస్పూను
- చింతపండు రసం - కప్పు
- బెల్లంతురుము- 2 టేబుల్‌స్పూన్లు
- ఇంగువ- చిటికెడు
- నూనె- 2 టేబుల్‌స్పూన్లు
- శనగపప్పు- టేబుల్‌స్పూను
- మినప్పప్పు- అర టేబుల్‌స్పూను
- జీలకర్ర- టేబుల్‌స్పూను
- పచ్చిమిర్చి-2
- వెల్లుల్లి రెబ్బలు-8
- బియ్యం పిండి-2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం:
- ముందుగా స్టౌపై పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి తాలింపు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి.
- తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లో వేగాక.. ఇంగువ వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు పొట్టు తీసి శుభ్రంగా కడిగిన గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలపండి.
- తర్వాత కొన్ని నీళ్లు పోయండి. ఇప్పుడు మూత పెట్టి గుమ్మడికాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోండి.
- గుమ్మడికాయ ముక్కలు ఉడికిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపండి.
- కొద్దిసేపటి తర్వాత చింతపండు రసం వేసి మిక్స్ చేయండి. అలాగే బెల్లం వేసి కలపండి. ఇప్పుడు దప్పళానికి సరిపడా నీళ్లు పోసి పది నిమిషాలు ఉడికించుకోండి.
- ఈ టైమ్‌లోనే కొన్ని నీళ్లలో బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని దప్పళంలో పోసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. (గుమ్మడికాయ దప్పళంలో బియ్యం పిండి వాటర్ వేసుకోవడం వల్ల చిక్కగా ఉంటుంది)
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ దప్పళం రెడీ. ఈ దప్పళాన్ని వేడివేడి అన్నంతో తింటే టేస్ట్ అద్దిరిపోతుంది.
- ఈ దప్పళం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. నచ్చితే మీరు కూడా ఓ సారి ఈ రెసిపీ ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :