వైఎస్సార్సీపీకి మరో షాక్ - ఆళ్ల నాని రాజీనామా
YSRCP Leader Alla Nani Resigned (ETV Bharat)
Published : Aug 9, 2024, 5:20 PM IST
YSRCP Leader Alla Nani Resigned : వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా ఆ జాబితాలో మరొకరు చేరారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు.