గొర్రెల పంపిణీ స్కామ్ అప్డేట్ - ఇద్దరు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ
Published : Jun 10, 2024, 12:37 PM IST
Telangana Sheep Distribution Scam Latest News : గొర్రెల పంపిణీ పథకం కేసులో ఇద్దరు నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. పశుసంవర్ధకశాఖ మాజీ సీఈవో రాంచందర్ నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారించనున్నారు. వీరిద్దరినీ 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈ క్రమంలో అధికారులు వారిని చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో రూ.700 కోట్ల అక్రమాలకు సంబంధించి ఆధారాలు గుర్తించినట్లు సమాచారం. బినామీ పేర్లతో బిల్లులను విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో అధికారులు ఇప్పటికే సుమారు 10 మంది నిందితులను గుర్తించారు.