ఎంతపని చేశావమ్మా - ఇద్దరి పిల్లలతో కలిసి కాల్వలోకి దూకిన మహిళ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 29, 2024, 10:24 PM IST
Woman Along with her two Children jumped into Canal : ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడ స్క్రూ బ్రిడ్జి వద్ద ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బందర్ కాలువలో దూకింది. గమనించిన స్థానికులు ఏడాది వయసు ఉన్న చిన్నారిని బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మహిళ, మరో చిన్నారి కోసం కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.