Man Commits Suicide : భార్య,ఆమె సోదరులు దాడులకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తోందని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ జిల్లాలో దారుణం - భార్య వేధిస్తోందని భర్త బలవన్మరణం!
Published : Aug 9, 2024, 7:03 PM IST
మృతుని బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం భూదేవి హిల్స్ లో నివసించే చిలుక శివసాగర్ (32)కి బాలాపూర్కి చెందిన చామంతితో 2021లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే వారి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. 4 నెలల క్రితం భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె సోదరులు శివసాగర్పై దాడికి పాల్పడి పోలీస్ స్టేషన్లో అక్రమకేసులు బనాయించారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. చామంతి సోదరులపై పోలీసులకు శివసాగర్ ఫిర్యాదు చేయడంతో కేసు వెనక్కి తీసుకోవాలని వారు బెదిరింపులకు గురిచేశారు. వారి వేధింపులు తట్టుకోలేక విషం తాగి చనిపోయినట్లు బాధితుడి బంధువులు వివరించారు.