2 Gates Lifted in Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీలోని దెబ్బతిని, కుంగిన ఏడో బ్లాక్‌లో 18, 19 గేట్లను ఇంజినీరింగ్ అధికారులు గురువారం 100.50 మీటర్ల మేర (పూర్తిస్థాయి)లో పైకెత్తారు. 18వ గేటు ఎత్తడానికి పలు సమస్యలు ఏర్పడగా, ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగారు.
Published : Jun 13, 2024, 10:21 PM IST
మేడిగడ్డ బ్యారేజీలోని మరో 2 గేట్ల ఎత్తివేత
Two Gates Lifted in Medigadda Barrage (ETV Bharat)
బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఉండగా, గత అక్టోబరులో బ్యారేజీ కుంగినప్పుడు 77 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మొత్తంగా ఏడో బ్లాక్‌లో ఆరు గేట్లను పూర్తిగా ఎత్తగా, ఇంకా 20, 21 గేట్లను తొలిగించాల్సి ఉంది. ఇందులో 20వ గేటు కటింగ్ పూర్తయింది. 21వ గేటును ఎత్తే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే కటింగ్‌తో తొలగించనున్నారు. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ స్టేషన్ రీసెర్చ్ బృందం పరీక్షలను కొనసాగిస్తుంది.