ETV Bharat / state

'మీ మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు' : సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు - Konda Surekha Apologize to Samantha

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Updated : 1 hours ago

Konda Surekha Apologize to Actress Samantha : నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. మంత్రి మాటలపై సమంత ఘాటుగానే స్పందించారు. ఆమెతో పాటు నాగార్జున, నాగ చైతన్య సహా సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సైతం మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. ఈ విషయం పెద్దది కావడంతో తాజాగా మంత్రి క్షమాపణలు తెలిపారు.

Konda Surekha Apologize to Actress Samantha
Konda Surekha Apologize to Actress Samantha (ETV Bharat)

Minister Surekha Apologized to Actress Samantha : నటి సమంతకు సంబంధించి బుధవారం తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ తాజాగా స్పందించారు. ఈ మేరకు నటి సమంతకు ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని, కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదని వివరణ ఇచ్చారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఆమె కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అన్యద భావించవద్దని మంత్రి సురేఖ కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్​ చేశారు.

"నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే. కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బ తీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే, బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. అన్యద భావించవద్దు." - కొండా సురేఖ, మంత్రి

అసలేం జరిగిందంటే : అక్టోబరు 2న హైదరాబాద్​ లంగర్​హౌస్​లో మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, బీఆర్​ఎస్​ నేత కేటీఆర్​పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. 'కేటీఆర్​ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్​. గతంలో ఫోన్​ ట్యాపింగ్​ ద్వారా అందరినీ ఇబ్బందులకు గురి చేశారు. హీరోయిన్స్​ తొందరగా పెళ్లిళ్లు చేసుకుని, సినిమాలు విడిచి వెళ్లిపోవడానికి కేటీఆర్​నే కారణం. కేటీఆర్​ మత్తు పదార్థాలకు అలవాటు పడి, వారిని కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు పెట్టారు. బ్లాక్​ మెయిల్​ చేసి, వాళ్ల జీవితాలతో ఆడుకున్నారు. కేటీఆర్​ మాదిరిగానే అందరూ ఉంటారు అని అనుకోవద్దు.' అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

సమంత ట్వీట్ : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ నటి సమంత ఎక్స్​ వేదికగా స్పందించారు. తన విడాకులు వ్యక్తిగత విషయమన్నారు. 'వాటి గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలి. స్త్రీగా ఉండటానికి, బయట వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం కావాలి. నా ప్రయాణానికి గర్వపడుతున్నా. దాన్ని చిన్న చూపు చూడొద్దు. మంత్రిగా మాట్లాడే వ్యాఖ్యలకు తీవ్రత ఉంటుందన్న విషయం అర్థం చేసుకొని ఉంటారు. వ్యక్తిగతంగా ఉన్న విషయాలను తప్పుగా అన్వయించుకోవద్దు. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాము. అందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. రాజకీయ యుద్ధాల్లో నా పేరును లాగొద్దు. నేను రాజకీయాలకు ఎప్పుడూ దూరమే. అలానే కొనసాగుతాను.' అంటూ తెలిపారు. దీంతో సమంతకు మంత్రి సురేఖ తాజాగా క్షమాపణలు తెలియజేశారు.

సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత - ఏమన్నారంటే? - Samantha On Konda Surekha Comments

Last Updated : 1 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.