Wimbledon 2024 Final Ticket Price:2024 వింబుల్డన్ ఫైనల్ ఫైట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. యావత్ క్రీడాలోకం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. లండన్ టెన్నిస్ క్లబ్ ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ ఎంట్రీ టికెట్ ధరలు మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నాయి. అత్యధికంగా టికెట్ ధర 10,600 డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 8.90 లక్షలు అన్నమాట. అంటే ఓ స్పోర్ట్స్ ఈవెంట్లో అత్యంత ఖరీదైన ఎంట్రీ టికెట్ ఇదే!
వామ్మో ఎంట్రీ టికెట్ రూ.8.90 లక్షలా- స్పోర్ట్స్ ఈవెంట్లో ఇదే రికార్డ్ అంట!
Published : Jul 13, 2024, 4:59 PM IST
Wimbledon 2024 Final Ticket Price (Source: Associated Press)
కాగా, ఈ మ్యాచ్‌లో 7సార్లు ఛాంపియన్ నొవాక్ జకోవిచ్, డిఫెండింగ్ ఛాంప్ కార్లోస్ అల్కరాస్ తలపడనున్నారు. ఆదివారం (జులై 14)న సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌కు దాదాపు రూ.22 కోట్లు, రన్నరకు రూ. 12కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.