Ganesh Immersion in Saroornagar Mini Tank Bund : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణేశుడి నిమజ్జనాలు సాగుతున్నాయి. భాగ్యనగరం గణేశుడి నిమజ్జనాల శోభతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ప్రాంతాల్లో గణనాథులు నిమజ్జనానికి క్యూ కట్టారు. శివ పుత్రుని శోభాయాత్రతో ఆ ప్రాంతాలు జన కళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సరూర్‌నగర్‌లో కూడా గణనాథులను శోభాయాత్రగా తీసుకొచ్చి సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనాలకు భారీ ఏర్పాట్లు చేశారు.
క్రేన్ డ్రైవర్లకు రెస్టు బస్సు ఏర్పాటు : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జనంలో పాల్గొంటున్న క్రేన్ ఆపరేటర్లకు రెస్టు బస్సును ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ 5 డిప్యూటీ కమిషనర్ సుజాత వెల్లడించారు. సరూర్‌నగర్ మినీ ట్యాంక్ వద్ద నిమజ్జనం కోసం 8 మంది క్రేన్ ఆపరేటర్లు, మరో నలుగురు మొబైల్ క్రేన్ ఆపరేటర్లు విధుల్లో ఉన్నారని అన్నారు. గణేశ్ నిమజ్జనాలు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు.
సరూర్‌నగర్ ట్యాంక్‌బండ్‌లో 1500 విగ్రహాలు నిమజ్జనం : మరోవైపు సరూర్‌నగర్‌లో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షించారు. భక్తులు సందర్శకులు అధికారుల సూచించిన నియమాలను పాటించాలని కోరారు. అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు ఉపయోగించుకోవాలన్నారు. అలాగే భక్తులందరూ కూడా నిమజ్జన సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ డైవర్షన్లకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులతో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నేడు 1500 విగ్రహాలు సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం : ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు జరిగిన శోభాయాత్రలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. ఘనంగా జరిగిన శోభాయాత్ర తర్వాత గణనాథుడు గంగమ్మ ఒడిలో సేద తీరాడు. భారీ క్రేన్‌ను ఉపయోగించి హుస్సేన్‌సాగర్‌లో గణపతిని నిమజ్జనం చేశారు. ఈసారి 70 అడుగుల మట్టి గణపయ్యను ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడం రికార్డుగా ఉంది.
రూ.30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024