Ishan Kishan Team India:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. శ్రీలంక పర్యటనలో అతడికి జట్టులో చోటు దక్కలేదు. సెలక్టర్లు మరోసారి అతడికి మొండిచేయి చూపారు. వన్డే సంగతి అటుంచితే కనీసం టీ20 సిరీస్‌కైనా ఇషాన్‌ను ఎంపిక చేయలేదు. ఇక శివమ్ దూబే టీ20, వన్డే రెండు సిరీస్‌లకు ఎంపికయ్యాడు. మరోవైపు యంగ్ ప్లేయర్లు హర్షిత్ రానా, రియాన్ పరాగ్ వన్డే సిరీస్‌కు సెలెక్ట్ అయ్యారు.
పాపం ఇషాన్- మళ్లీ నిరాశే
Published : Jul 18, 2024, 9:15 PM IST
Ishan Kishan Team India (Source: Getty Images)
అయితే మానసిక ఒత్తిడి కారణంగా గతేడాది సౌతాఫ్రితా టూర్ నుంచి ఇషాన్ మధ్యలోనే స్వదేశానికి వచ్చాడు. ఆ తర్వాత అతడు దుబాయ్‌లో కనిపించడం, రంజీల్లో ఆడకుండా ఐపీఎల్‌కు ప్రాక్టీస్ చేయడం వంటి కారణాలతో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కూడా చోటు దక్కలేదు. తాజాగా శ్రీలంక పర్యటనలోనూ నిరాశే మిగిలింది.