national

ETV Bharat / snippets

భారత్ x శ్రీలంక - టీ20, వన్డే సిరీస్‌ షెడ్యూల్ ఇదే

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 8:25 PM IST

Team India Srilanka Tour
Team India (Associated Press)

Team India Srilanka Tour : టీమ్‌ఇండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో అదరగొడుతోంది. జులై 14తో ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. అక్కడ లంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ టూర్‌కు సంబంధించిన వివరాలను బీసీసీఐ అనౌన్స్​ చేసింది. టీ20 మ్యాచ్‌లన్నీ పల్లెకెలెలో సాయంత్రం 7 గంటలకు, వన్డే మ్యాచ్‌లు కొలంబోలో మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనున్నాయని తెలిపింది. అయితే త్వరలోనే జట్లను ప్రకటించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇక భారత కోచ్‌గా గౌతమ్‌ గంభీర్ ప్రయాణం కూడా ఈ సిరీస్‌తోనే మొదలవుతుంది.

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే :
జులై 26 - తొలి టీ20

జులై 27 - రెండో టీ20

జులై 29 - మూడో టీ20

వన్డే సిరీస్‌ షెడ్యూల్

ఆగస్టు 1 - మొదటి వన్డే

ఆగస్టు 4 - రెండో వన్డే

ఆగస్టు 7 - మూడో వన్డే

ABOUT THE AUTHOR

...view details