national

ETV Bharat / snippets

ఆస్ట్రేలియాకు షాక్- ఫైనల్​కు దూసుకెళ్లిన సౌతాఫ్రికా

T20 Semi Final
T20 Semi Final (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 17, 2024, 10:37 PM IST

Aus vs SA T20 Semi Final :2024 మహిళల టీ20 వరల్డ్​కప్​లో సౌతాఫ్రికా జట్టు ఫైనల్​కు దూసుకెళ్లింది. సెమీఫైనల్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా ఊహించని షాకిచ్చింది. గురువారం జరిగిన సెమీస్​లో ఆసీస్​పై సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆసీస్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అన్​కీ బాష్ (74 పరుగులు), లారా వోల్వార్ట్ (44 పరుగులు) రాణించారు. దీంతో ఆరుసార్లు టైటిల్ విన్నర్ ఆసీస్​ ఈసారి ఫైనల్​ చేరకుండా సెమీస్​లోనే ఇంటిబాట పట్టింది.

అంతకుముందు బ్యాటింగ్​లో ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. బెత్ మూనీ (44), ఎలీస్ పెర్రీ (31) రాణించారు. తహిళ (27), లిచీఫీల్డ్ (16) ఆకట్టుకున్నారు. కానీ, బౌలింగ్​లో తేలిపోవడం వల్ల ఏడో టైటిల్​పై కన్నేసిన ఆసీస్ సెమీస్​లోనే వెనుదిరగాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details