national

ఆయనే స్ఫూర్తి, అదే నా విజయ రహస్యం: కెప్టెన్ రోహిత్

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 10:04 AM IST

Rohit Sharma Inspiration
Rohit Sharma Inspiration (Source: Associated Press)

Rohit Sharma Inspiration:టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్​లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. భారత క్రికెట్​లో అత్యుత్తమ ప్లేయర్, కెప్టెన్​గానూ నిలిచాడు. కెరీర్​లో ఇంత విజయవంతమైన రోహిత్​ జీవితంలో ఒకరి నుంచి స్ఫూర్తి పొందాడట. అది ఎవరో కాదు తన తండ్రే.

'ప్రతి విషయంలోనూ నాకు మానాన్న గురునాథ్‌ శర్మే స్ఫూర్తి. చిన్నప్పుడు నా కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. పేదరికం కారణంగా నన్ను అమ్మమ్మాతాతయ్యల దగ్గర చదివించారు. తనకోసం ఏదీ కొనుక్కోకుండా, నాకోసం డబ్బు దాటి ఖర్చు పెట్టేవారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఉంటూ నవ్వుతూ కనిపించేవారు. నేను కెప్టెన్‌ అయ్యాక నాన్ననే గుర్తు చేసుకున్నా. జట్టుసభ్యుల్ని కన్నబిడ్డల్లా భావించి, ఒడుదొడుకుల్లో వారికి అండగా నిలబడ్డా. వారిలో ఎప్పుడూ ఆత్మవిశ్వాసం నింపేవాడిని. నా గురించి ఆలోచించుకోకుండా వారికి సౌకర్యాలన్నీ సమకూరేలా చూసుకున్నా. కెప్టెన్‌గా నా విజయ రహస్యం అదే' అని హిట్​మ్యాన్ ఓ సందర్భంలో చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details