Paris Olympics 2024 Archery Dhiraj Bommadevara :పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. మిక్స్డ్ డబుల్స్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, అంకిత భకత్ ద్వయం సెమీ ఫైనల్‌కు చేరింది. దీంతో వీరు పతకానికి మరో అడుగు దూరంలో నిలిచారు. ఈ క్వార్టర్స్ ఫైనల్లో అంకిత, ధీరజ్ ధ్వయం 5-3 తేడాతో స్పెయిన్‌పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో అంకిత, ధీరజ్ ధ్వయం ఇండోనేషియా ద్వయం ఆరిఫ్-కోరునిసాపై 5-1తో విజయం సాధించింది.
పతకానికి అడుగు దూరంలో తెలుగు కుర్రాడు - 1972 తర్వాత ఆసీస్‌పై భారత్ విజయం
Published : Aug 2, 2024, 7:06 PM IST
Paris Olympics 2024 (source Associated Press)
ఆస్ట్రేలియాపై భారత హాకీ జట్టు విజయం(Paris Olympics 2024 Indiahockey)- ఒలింపిక్స్ గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించింది. పూల్ బి నుంచి ఇప్పటికే భారత్, బెల్జియం, ఆసీస్ క్వార్డర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం 1972 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.