Published : Jun 19, 2024, 6:27 AM IST
నీరజ్ చోప్రా పసిడి త్రో
Neeraj Chopra Goid Medal Paavo Nurmi 2024 :పారిస్ ఒలింపిక్స్ ముందు భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా సూపర్ ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. ఫిన్లాండ్లో జరిగిన పావో నూర్మి క్రీడల్లో అతడు గోల్డ్ మెడల్ సాధించాజు. జావెలిన్‌ను ఉత్తమంగా 85.97 మీటర్లు విసిరి టాప్‌లో నిలిచాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో 83.62 మీ, 83.45 మీటర్లు విసిరిన నీరజ్ ఆరంభంలో మాత్రం వెనుకపడ్డాడు. కానీ మూడో త్రోలో 85.97 మీటర్లతో అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం అంతకుమించిన ప్రదర్శన చేయకపోయినప్పటికీ (82.21 మీ, ఫౌల్, 82.97 మీ) గోల్డ్ మెడల్‌ను దక్కించుకున్నాడు. ఫిన్లాండ్ ప్లేయర్ టోని (84.19 మీ), అలివర్ (83.96 మీ) సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు. మాజీ నంబర్ వన్ ప్లేయర్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 82.58 మీ) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.