Bajrang Punia NADA :టార్ రెజ్లర్ బజరంగ్ పునియా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)పై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాడాలోని లోపాలు ఎత్తి చూపినందుకు గానూ వారు తనను లక్ష్యంగా చేసుకుని, రెజ్లింగ్లో కొనసాగకుండా కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించాడు.
'తప్పులు చూపినందుకు టార్గెట్ - నా కెరీర్ ముగించాలనేదే వాళ్ల ప్లాన్'
Published : Jul 2, 2024, 6:48 AM IST
నాడా నన్ను టార్గెట్ చేసిందని ఈ చర్యలతో స్పష్టమవుతోంది. నన్ను రెజ్లింగ్లో కొనసాగకుండా చేయాలని కుట్రపన్నుతున్నారు. వాళ్ల దగ్గర ఎటువంటి సమాధానాలు లేవు. అంతే కాకుండా తాము తమ తప్పులకు బాధ్యత కూడా తీసుకోవడం లేదు. కేవలం అథ్లెట్ను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి లోపాలను ఎవరూ ప్రశ్నించకూడదని నాడా అనుకుంటోంది. ఎవరైనా అలా చేస్తే వాళ్లను టార్గెట్ చేస్తోంది. వాళ్లను ఆటలో కొనసాగకుండా చేయాలనుకుంటోంది. నాడా అహంకారంపై నేను కచ్చితంగా పోరాడుతాను. దీనికి మా లాయర్ త్వరలోనే బదులిస్తాడు" అంటూ బజ్రంగ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.