Imane Khelif Paris Olympics:పారిస్ ఒలింపిక్స్‌లో వివాదస్పదంగా మారిన అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్ పసిడి పతకం గెలిచింది. శనివారం తెల్లవారుజామున లి యాంగ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో ఇమానె 5-0తేడాతో నెగ్గి స్వర్ణం మద్దాడింది. అయితే కెరీర్లో రెండో ఒలింపిక్స్ ఆడుతున్న ఇమానెకు ఇదే తొలి పతకం. మొదటి పతకమే స్వర్ణం కావడం విశేషం. కాగా, ఆమె మెడల్ సాధించడంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు కొనసాగించగా, మరికొందరు అభినందిస్తున్నారు.
ఛాంపియన్‌గా బాక్సర్ ఇమానె- కాంట్రవర్సీల మధ్యే 'గోల్డ్' పట్టేసింది
Imane Khelif Paris Olympics (Source: Associated Press)
Published : Aug 10, 2024, 10:16 AM IST
|Updated : Aug 10, 2024, 10:56 AM IST
అయితే ఇమానె ఇజ్రాయెల్ బాక్సర్‌పై కేవలం 46 సెకన్లలోనే బౌట్ నెగ్గింది. దీంతో ఈమెపై పురుష లక్షణాలున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈమెను పోటీల నుంచి తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. దీనిపై స్పందిచిన ఒలింపిక్ సంఘం నిబంధనల మేరకే ఇమానె పోటీల్లో పాల్గొంటుందని స్పష్టం చేసింది.
Last Updated : Aug 10, 2024, 10:56 AM IST