Modi Got Russia's Highest Civilian Honour : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యన్ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'ను ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడంలో చేసిన సేవలకు గానూ మోదీని ఈ మేరకు సత్కరించారు. ఈ పురస్కారాన్ని స్వీకరించడం తనకు గౌరవంగా ఉందని, దానిని భారత ప్రజలకు అంకితమిస్తున్నట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. అయితే, ఈ అవార్డును 2019లోనే ప్రధాని మోదీకి ప్రకటించగా, ఈరోజు మోదీ, పుతిన్ చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం
Modi Got Russia Highest Civilian Honour (ANI)
Published : Jul 9, 2024, 7:49 PM IST
|Updated : Jul 9, 2024, 8:38 PM IST
రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు విందు ఇచ్చారు. సోమవారం రాత్రి "ఇద్దరు స్నేహితులు, విశ్వసనీయమైన భాగస్వాముల కలయిక అపూర్వం. మోదీని పుతిన్ ఘనంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు" అని భారత విదేశాంగశాఖ ఎక్స్‌లో పేర్కొంది.
Last Updated : Jul 9, 2024, 8:38 PM IST