Published : Jun 14, 2024, 7:30 AM IST
SSMB29 - కీలక అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
Rajamouli Maheshbabu Movie shooting : రాజమౌళి - మహేశ్‌బాబు SSMB 29 సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా, అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారు అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో రాజమౌళి తండ్రి, ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం రాజమౌళి SSMB 29కు సంబంధించి సెట్ వర్క్ చేయిస్తున్నట్లుగా తెలిపారు.సెట్ వర్క్స్ మొత్తం పూర్తైన తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అఫీసియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాతే షూటింగ్ మొదలు కానుందని, ఇదంతా జరగడానికి మరో రెండు నెలల సమయం అయినా పెట్టొచ్చని చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రం కోసం మహేశ్ ఇప్పటికే లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా మారారు. అలాగే బరువు కూడా పెరిగే ప్రయత్నం చేస్తున్నారట.