తెలంగాణ

telangana

ETV Bharat / snippets

రవీనా మద్యం తాగలేదు - దాడి ఘటనపై పోలీసులు క్లారిటీ

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 11:44 AM IST

Source ANI news
Raveena tandon (Source ANI news)

RaveenaTandon CarAccident : నటి రవీనా టాండన్, ఆమె డ్రైవర్‌పై జరిగిన దాడి ఘటన కలకలం సృష్టించింది. మాపై దాడి చేయకండి అంటూ ఆమె విజ్ఞప్తి చేస్తున్నట్లుగా వీడియో చక్కర్లు కొడుతోంది. రవీనా, ఆమె డ్రైవర్‌ మద్యం తాగి, ర్యాష్‌ డ్రైవింగ్‌కు పాల్పడ్డారని కొందరు వారిపై కంప్లైంట్​ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ముంబయి పోలీసులు వివరణ ఇచ్చారు. అది తప్పుడు కేసు అని, నటి మద్యం తాగలేదని స్పష్టతనిచ్చారు.

"రవీనా, ఆమె డ్రైవర్‌పై తప్పుడు కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను చూశాం. కారును పార్క్‌ చేసేందుకు డ్రైవర్‌ రివర్స్‌ చేసే సమయంలో ఓ కుటుంబం ఆ పక్క నడుచుకుంటూ వెళ్లింది. వారే కారును ఆపి డ్రైవర్‌తో గొడవ పడ్డారు. రివర్స్‌ చేస్తున్నప్పుడు వెనకవైపు చూసుకోవాలంటూ గొడవకు దిగారు. ఇది తీవ్రమైంది. ఈ క్రమంలోనే రవీనా గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం గొడవపడిన వ్యక్తులు స్టేషన్‌లో కంప్లైంట్ చేశార"ని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details