Published : Jun 27, 2024, 11:04 AM IST
'కల్కి' సర్ప్రైజ్ - గెస్ట్ రోల్స్‌లో ఈ ఐదుగురిని అస్సలు ఊహించలేదే!
Kalki 2898AD Guest Roles :ప్రభాస్- నాగ్అశ్విన్ 'కల్కి 2898ఏడీ' భారీ విజయాన్ని అందుకుంది. భారీ బడ్జెట్‌తో, తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది(Kalki 2898AD review). భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించి అద్భుతం చేశారు. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్, విజువల్స్‌తో పాటు అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికాపదుకొణె, శోభన,దిశాపటాని, కీర్తిసురేశ్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలానే సినిమాలో ఊహించని గెస్ట్ రోల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఉన్నట్లు రిలీజ్‌కు కొన్ని గంటల ముందు చెప్పి సర్ప్రైజ్ చేశారు నాగ్అశ్విన్. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రామ్‌గోపాల్‌వర్మ, రాజమౌళి, మృణాల్‌ఠాకూర్, కె.వి. అనుదీప్‌తో పాటు ఫరియాఅబ్దుల్లా కనిపించి ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. వీరిందరి పాత్రలు కథకు తగ్గట్టుగానే సాగాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.