షూటింగ్లో గాయపడ్డ ప్రియాంక చోప్రా
Published : Jun 19, 2024, 12:45 PM IST
Actor Priyanka Chopra Jonas Injured :బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గాయపడింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. దీనికి సంబంధించిన ఫొటోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్ అయినట్లు సెల్ఫీ ఫొటోను షేర్ చేసింది. స్టంట్ చేస్తుండగా ఇలా జరగినట్లు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు ఆమెకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే షూటింగ్లలో గాయపడటం ఆమెకు కొత్తేమి కాదు. కాగా, ది బ్లఫ్ సినిమాను రస్సో బ్రదర్స్ బ్యానర్ ఏజీబీఓ స్టూడియోస్, అమెజాన్ ఎమ్జీఎమ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రియాంక మాజీ పైరేట్‌గా నటిస్తోంది. ఈ చిత్రం అమెజాన్ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆమె చివరిగా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల్ని అలరించింది.