Mohan Lal Health Update:సీనియర్ నటుడు మోహన్‌లాల్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన కొచ్చిలోని ఓ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. ఓ సినిమా షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లిన మోహన్‌లాల్ అక్కడే అస్వస్థతకు గురైనట్లు సినీ వర్గాల సమాచారం. కాగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసింది.
మోహన్‌లాల్‌కు అస్వస్థత- హాస్పిటల్లో ట్రీట్మెంట్!
Published : Aug 18, 2024, 4:55 PM IST
Published : Aug 18, 2024, 4:55 PM IST
Mohan lal (Source: ETV Bharat)
మెడిసిన్ వాడుతూ 5రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నటుడికి వైద్యులు సూచించినట్టు తెలిసింది. మోహన్‌లాల్ హెల్త్ బులెటిన్ అంటూ ఉన్న ఫొటోను ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. అయితే ఆ మెడికల్ సర్టిఫికెట్ జారీ చేసిన తేదీ ఆగస్టు 16గా ఉండడం గమనార్హం. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.