Rishabh Pant Birthday : టీమ్ఇండియా డైనమిక్ బ్యాటర్ రిషభ్ పంత్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పంత్ బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా అనేక మ్యాచ్‌ల్లో టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే రోడ్డు ప్రమాదం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన పంత్ రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్నాడు. 2024 ఐపీఎల్, టీ20 వరల్డ్‌కప్, రీసెంట్ బంగ్లా టెస్టు సిరీస్ ఇలా అన్నింట్లో రాణిస్తున్నాడు. ఇక శుక్రవారం అతడు 27వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి తన కెరీర్లో పంత్ సాధించిన 5 అరుదైన రికార్డులు ఏంటంటే?
సిక్స్‌తోనే ప్రారంభం
2018లో ఇంగ్లాండ్‌పై పంత్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇంటర్నేషనల్ డెబ్యూ మ్యాచ్‌లో ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. దాన్ని జయించడం ఆషామాషీ విషయం కాదు. అయితే కెరీర్లో ఆడుతున్న తొలి టెస్టులో ఎదుర్కొన్న మొదటి బంతినే పంత్ సిక్స్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు.
వికెట్ కీపర్‌గా రికార్డు
అలాగే 2018 అదే సిరీస్ ఐదో టెస్టులో పంత్ శతకంతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్ 114 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో సెంచరీ బాదిన టీమ్ఇండియా తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
అత్యధిక క్యాచ్‌ల రికార్డు
సింగిల్ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు కూడా రిషభ్ పంత్ పేరిట రికార్డు ఉంది. 2018లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఈ మైలురాయి అందుకున్నాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి పంత్ 11 క్యాచ్‌లు పట్టాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌కు చెందిన జాక్ రస్సెల్, దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ రికార్డును సమం చేశాడు.
ఆసీస్ గడ్డపై
అలాగే 2019లో ఆస్ట్రేలియాపై పంత్ శతకం బాదాడు. సిడ్నీ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో పంత్ 159 పరుగులతో సత్తా చాటాడు. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన భారత తొలి వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు. స్వదేశంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొని శతకం బాదడం ఆషామాషీ విషయం కాదనే చెప్పాలి.
గబ్బా కింగ్
2021లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ చారిత్రక విజయం సాధించింది. గబ్బా మైదానంలో 3 దశాబ్దాలకుపైగా తిరుగులేని ఆసీస్‌కు భారత్ ఓటమి రుచి చూపించింది. ఈ టెస్టు సిరీస్ నాలుగో మ్యాచ్‌లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో నెగ్గి చరిత్ర సృష్టించింది. అయితే ఈ విజయంలో రిషభ్ పంత్‌ది కీలక పాత్ర. ఛేదనలో (రెండో ఇన్నింగ్స్) అజేయంగా 89 పరుగులు బాది టీమ్ఇండియాకు విజయం అందించాడు. పంత్ కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి.
కీపర్‌గానూ అదుర్స్
బ్యాటింగ్‌తోనే కాదు కీపింగ్ తోనూ పంత్ రికార్డులు సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 మందిని ఔట్ చేసిన భారత వికెట్ కీపర్ గా పంత్ నిలిచాడు.
1⃣4⃣2⃣ intl. matches
— BCCI (@BCCI) October 4, 2024
4⃣5⃣1⃣2⃣ intl. runs
7 intl. hundreds 💯
ICC Men's T20 World Cup 2024 winner 🏆
Here's wishing Rishabh Pant a very Happy Birthday 👏🎂#TeamIndia | @RishabhPant17 pic.twitter.com/4OA7fzdXpq
ఒక్క సెంచరీతో ర్యాంకింగ్స్‌లోకి పంత్ రీ ఎంట్రీ - రోహిత్, విరాట్ బిగ్ డ్రాప్ - ICC Ranking 2024
'ధోనీతో పోల్చవద్దు- నన్ను నాలాగే ఉండనివ్వండి' - Pant Dhoni Comparison