national

TCS షేర్​ హోల్డర్స్​కు గుడ్​ న్యూస్​- ఈసారి డివిడెండ్​ ఎంతో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 6:51 PM IST

TCS Q1 Results 2024
TCS Q1 Results 2024 (ANI)

TCS Q1 Results 2024 :దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది. గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది కంపెనీ ఏకీకృత నికర లాభం 8.7శాతం పెరిగి రూ.12,040 కోట్లకు చేరింది. గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టీసీఎస్‌కు రూ.11,074కోట్ల నికర లాభం వచ్చింది. కాగా ఈసారి కంపెనీ ఆదాయం 5.4శాతం పెరిగి రూ. 62,613 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంతో పోలిస్తే టీసీఎస్ నికర లాభం 3.1శాతం మేర తగ్గడం గమనార్హం. రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో టీసీఎస్ షేరుపై రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను టీసీఎస్ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సాధించిన ఫలితాలు సంతోషకరంగా ఉన్నాయని కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కె కృతివాసన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details