UGC NET Exam Cancelled : NEETలో అవతవకలు జరిగాయని దేశమంతటా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC- NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం రావడం వల్ల యూజీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను కాపాడటం కోసమే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది.
UGC NET పరీక్ష రద్దు- అవకతవకలు జరగడమే కారణం
UGC NET Exam 2024 (Getty Images)
Published : Jun 19, 2024, 10:38 PM IST
మరోవైపు, NEET పేపర్ లీకేజీపై వస్తున్న ఆరోపణలపైన కూడా స్పందించింది కేంద్రం. గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. పట్నాలో నీట్ అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని కేంద్రం తెలిపింది. బిహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని చెప్పింది.