national

రాహుల్‌ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్- ప్రతిపక్షనేత ప్రసంగంపై తీవ్ర దుమారం

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 11:03 AM IST

Updated : Jul 2, 2024, 12:23 PM IST

Rahul Gandhi Speech In lok sabha
Rahul Gandhi Speech In lok sabha (ANI)

Rahul Gandhi Speech In Lok Sabha: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను స్పీకర్‌ రికార్డులను నుంచి తొలగించారు. అధికారపక్షం అభ్యంతరాలతో హిందూమతాన్ని ఉద్దేశించి రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు సహా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, అగ్నివీర్‌, మోదీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ప్రకటించింది.

ఈ విషయంపై రాహుల్​ గాంధీ స్పందించారు. 'ప్రధాని మోదీ తన ప్రపంచంలోని నిజాలను మాత్రమే తొలగించగలరు. కానీ, వాస్తవ ప్రపంచంలో సత్యాన్ని ఎవరూ తొలగించలేరు. నేను ఏమి చెప్పినా అది పూర్తిగా నిజమే ఉంటుంది. మోదీ ఎంత కావాలనుకుంటే అంత తొలగించుకోవచ్చు. కానీ ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది' అని రాహుల్ గాంధీ అన్నారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా హిందుత్వ అంశంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో పెను దుమారానికి దారితీశాయి.

Last Updated : Jul 2, 2024, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details