PM Modi Russia Visit: జులై 8-10 వరకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా, ఆస్ట్రియాలో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని 8,9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారని వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, ఇరు దేశాల మధ్యనున్న సంబంధాలను సమీక్షించుకోవడం, ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై నేతలిద్దరూ చర్చలు జరుపుతారని తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి.
మోదీ రష్యా పర్యటన- యుద్ధం తర్వాత మొదటిసారి- పుతిన్‌తో కీలక భేటీ!
Published : Jul 5, 2024, 7:05 AM IST
రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియాకు పయనమవుతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. 41ఏళ్ల సుదీర్ఘ విరామం భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించనున్నారని పేర్కొంది. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డెర్, ఛాన్సలర్ కార్ల్ నెహామర్‌తో ప్రధాని సమావేశమవుతారని తెలిపింది. భారత, ఆస్ట్రియా వ్యాపారవేత్తలను ఉద్దేశించి మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ ప్రసంగించనున్నారు. రష్యాలోని మాస్కో, ఆస్ట్రియాలోని వియన్నాలో ప్రవాస భారతీయులతో ప్రధాని సంభాషించనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది.