Mother Son Duo Passes Out In Exam :చదవాలనే ఆసక్తి ఉంటే చాలు వయసుతో సంబంధం లేదని నిరూపించింది మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ. తన కుమారుడితో కలిసి ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలైంది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో కుమారుడి కన్నా ఎక్కువ మార్కులు కూడా సాధించింది.
ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన తల్లీకొడుకులు- ఇద్దరిలో 'ఆమె'కే ఎక్కువ మార్కులు
Published : May 23, 2024, 9:23 AM IST
కుర్లా ప్రాంతానికి చెందిన గీత పాసి 2003లో ఇంటర్ తొలి ఏడాది పరీక్షలు రాశాక కొన్ని కారణాల వల్ల చదువుకు స్వస్తి పలికింది. ఆ తర్వాత ఏడాదే పెళ్లి చేసుకుంది. ఇక ఆమె కుమారుడు ఆర్యన్ 12వ తరగతి చదువుతుండడం వల్ల తాను కూడా పరీక్షలు రాసి ఇంటర్ పూర్తి చేయాలనుకుంది. పరీక్షలకు ఫీజు కట్టి ఇంట్లోనే చదువుకుంది. రోజూ ఉదయమే లేచి చదువుకుని ఆ తర్వాత ఇంటి పనులు చేసుకునేది. పరీక్షల్లో మంచి మార్కులతో పాసైంది. ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ కష్టపడి చదివి విజయం సాధించిన గీతను అందరూ అభినందించారు.