national

ETV Bharat / snippets

చీఫ్ సెక్రటరీగా సుజాత సౌనిక్- రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా సీఎస్​గా రికార్డ్​!

Maharashtra First Woman Chief Secretary
Maharashtra First Woman Chief Secretary (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 30, 2024, 8:20 PM IST

Maharashtra First Woman Chief Secretary : మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాత సౌనిక్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి నితిన్ కరీర్ ఆదివారం పదవీ విరమణ చేసి సుజాత సౌనిక్​కు బాధ్యతలు అప్పగించారు. తద్వారా రాష్ట్ర చరిత్రలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్​కు చెందిన సుజాత మరో ఏడాది పాటు పదవిలో ఉండనున్నారు. సుజాత సౌనిక్ భర్త మనోజ్ సౌనిక్ కూడా కొన్నేళ్ల క్రితం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు రాష్ట్ర హోంశాఖలో అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details