LK Advani Discharged From Hospital :భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ ఆడ్వాణీ(96) గురువారం దిల్లీలోని ఆపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఆడ్వాణీ కుమార్తె ప్రతిభా అడ్వాణీ ఆయన్ను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. సీనియర్ న్యూరోలాజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి సమక్షంలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.
ఆస్పత్రి నుంచి ఎల్కే అడ్వాణీ డిశ్చార్జ్- వారంలో రెండోసారి
Published : Jul 4, 2024, 6:26 PM IST
LK Advani Discharged From Hospital (ANI)
అంతకుముందు, జూన్ 26న ఎల్కే ఆడ్వాణీ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆయన్ను దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యూరాలజీ విభాగానికి చెందిన వైద్యులు చికిత్స అందించారు. అనంతరం ఒక రోజులోనే(జూన్ 27న) ఆడ్వాణీ డిశ్చార్జ్ అయ్యారు.