SC ST Sub Quota Judgement : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను ఆమోదిస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఉపవర్గీకరణకు సర్వోన్నత న్యాయస్థానం ఆమోద ముద్ర వేయగా, తీర్పును సమీక్షించాలంటూ 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్ తోపాటు మరో నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది. పిటిషన్లు అన్నింటినీ పరిశీలించామని, తీర్పును సమీక్షించాల్సిన పరిస్థితులు కనిపించలేదని వెల్లడించింది. అందుకే వాటిని కొట్టివేస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.
ఎస్సీల ఉపవర్గీకరణ తీర్పుపై రివ్యూకు సుప్రీంకోర్టు నో
Published : Oct 4, 2024, 4:56 PM IST