Kolkata Doctor Case To CBI :కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఆదివారం నాటికి కేసును ఛేదించడంలో పోలీసులు విఫలమైతే, దర్యాప్తును సిబీఐకి అప్పగిస్తామని తెలిపారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని కూడా తాను కోరుకుంటున్నానన్నారు. మరణించిన వైద్యురాలి నివాసాన్ని సందర్శించిన తర్వాత మమతా బెనర్జీ స్థానిక విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఆదివారంలోపు మెడికో కేసు తేల్చకుంటే సీబీఐకి అప్పగిస్తా'- బంగాల్ పోలీసులకు మమత డెడ్‌లైన్
Published : Aug 12, 2024, 3:02 PM IST
|Updated : Aug 12, 2024, 7:07 PM IST
బంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల వైద్యులు సోమవారం నిరవధిక సమ్మెకు దిగారు. మరోవైపు ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకొని సెల్దా కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం 14 రోజుల పోలీస్ రిమాండ్‌కు అప్పగించింది.