national

"అన్ని రైళ్లలో 'కవచ్​ వ్యవస్థ' ఏర్పాటు చేస్తాం" - అశ్వినీ వైష్ణవ్​

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 6:54 AM IST

Indian Railways Kavach System rollout
Indian Railways (ANI)

Railway Kavach System Rollout Accelerates :రైలు ప్రమాదాలను అరికట్టేందుకు 10వేల రైలు బోగిల్లో అధునాతన ఆటోమేటిక్‌ రక్షణ వ్యవస్థ 'కవచ్‌ 4.0'ని ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. ఈ మేరకు 9వేల కిలోమీటర్ల మేర రైలు మార్గానికి కవచ్‌ వ్యవస్థను విస్తరింపజేయటానికి టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. గురువారం లోక్‌సభలో రైల్వే అనుబంధ పద్దులపై చర్చకు సమాధానమిచ్చిన అశ్విని వైష్ణవ్‌ 'వందే భారత్‌' స్లపీర్‌ రైళ్లను రైల్వే అభివృద్ధి చేస్తోందని స్పష్టంచేశారు. తొలి రైలు ప్రయోగ దశలో ఉందన్నారు. లోకో పైలెట్లకు సైతం సదుపాయాలను చాలా వరకూ మెరుగు పరిచామని రైల్వేమంత్రి పేర్కొన్నారు. అనుబంధ పద్దుల కింద రైల్వేకు 7.89 లక్షల కోట్లు కేటాయించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details