national

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 12:47 PM IST

ETV Bharat / snippets

మూడోసారి 'పుష్పక్' ప్రయోగం సక్సెస్- ఇస్రో ఖాతాలో మరో ఘనత

ISRO Pushpak Test
ISRO Pushpak Test (IANS)

ISRO Pushpak Test : పునర్వినియోగ వాహక నౌక పుష్పక్‌ను వరుసగా 3వ సారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విజయవంతంగా పరీక్షించింది. ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయంప్రతిపత్తిగల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో పేర్కొంది. అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్‌ ల్యాండింగ్ ఇంటర్‌ఫేస్, హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా పుష్పక్​ అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినట్లు తెలిపింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో పుష్పక్‌కు సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని వివరించింది. భూమికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో వైమానికదళ చినూక్‌ హెలికాప్టర్‌ నుంచి పుష్పక్‌ను జారవిడవగా, తీవ్రమైన గాలుల మధ్య అది స్వయంప్రతిపత్తితో కిందకు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. ల్యాండింగ్‌ వెలాసిటీ గంటకు 320 కిలోమీటర్లను మించిపోయిందనీ, రన్‌వేపై పారషూట్‌ తెరుచుకోగా అది గంటకు 100 కిలోమీటర్ల వేగానికి తగ్గిందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details