Hathras Stampede Main Suspect Surrenders : హాథ్రస్ తొక్కిసలాటకు కారణమైన ప్రధాన నిందితుడు దేవప్రకాశ్ మధుకర్ పోలీసులు, సిట్, ఎస్టీఎఫ్ ఎదుట లొంగిపోయాడని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 'దేవ్ ప్రకాశ్ మధుకర్ హాథ్రస్ సమావేశానికి ప్రధాన ఆర్గనైజర్‌గా ఉన్నారు. ఆయన ఏ నేరం చేయలేదు. మధుకర్ ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆయన ఒక హార్ట్ పేషెంట్. ఆయనకు ఏం జరగకూడదు. మేము ఎటువంటి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తాం' అని ఏపీ సింగ్ అన్నారు. నిందితుడు లొంగిపోయిన విషయాన్ని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
'హాథ్రస్' ప్రధాన నిందితుడి అరెస్ట్- మధుకర్‌ను సంప్రదించిన రాజకీయ పార్టీలు!
Hathras stampede NEWS (Associated Press)
Published : Jul 6, 2024, 8:06 AM IST
|Updated : Jul 6, 2024, 11:29 AM IST
అసలేం జరిగిదంటే
సత్సంగ్ పేరుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో భోలే బాబా పాదాలను తాకాలని భక్తులు పరుగెత్తారు. దీంతో తొక్కిసలాట జరగ్గా 121మంది మరణించారు.
Last Updated : Jul 6, 2024, 11:29 AM IST