ప్రముఖ జానపద గాయని శారద సిన్హా కన్నుమూత
Published : 14 hours ago
Folk Singer Sharda Sinha Passes Away :ప్రముఖ జానపద గాయని శారద సిన్హా (72) మంగళవారం కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శారద సిన్హా బిహార్‌కు చెందిన అత్యంత ప్రఖ్యాతి పొందిన గాయనీమణుల్లో ఒకరు. ఆమె ఛత్ గీత్, వార్షిక ఛత్ పండుగల సందర్భంగా పాడే పాటలకు చాలా ప్రసిద్ధి. ఆమె మైథిలి, భోజ్‌పురి, మాగాహి జానపద సంగీతంలో అనేక గొప్ప స్వరాలు కూర్చారు. సంగీత రంగంలో ఆమె చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం 2018లో పద్మ భూషణ్ పురస్కారాన్ని అందించింది. 1950 అక్టోబర్ 1న బిహార్‌లోని సుపాల్ జిల్లా, హులాస్ గ్రామంలో జన్మించిన ఆమె, తన 72 ఏట క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.