national

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 7:11 PM IST

ETV Bharat / snippets

డిప్యూటీ స్పీకర్‌ పదవి NDA ఎంపీకే- ఏ పార్టీకి దక్కుతుందో మరి?

Deputy Speaker Of 18th Lok Sabha
Deputy Speaker Of 18th Lok Sabha (ANI)

Deputy Speaker Of 18th Lok Sabha : 48 ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగడానికి కారణమైన డిప్యూటీ స్పీకర్‌ పదవిని అధికార ఎన్డీఏకు చెందిన ఎంపీనే చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే డిప్యూటీ స్పీకర్‌ పదవి చేపట్టే ఎంపీ పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డిప్యూటీ స్పీకర్‌ పదవికి కూడా విపక్షాలు పోటీపడితే మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 2014లో మొదటిసారి మోదీ సర్కారు అధికారం చేపట్టగా లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహజన్‌, అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై ఉప సభాపతిగా ఉన్నారు. 2019లో రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఖాళీగా ఉంచారు. ఈసారి ఎన్డీఏలోని ఓ పార్టీకి ఆ పదవి కేటాయించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details