తప్పుడు యాడ్స్ ఇస్తున్న కోచింగ్ అకాడమీకి రూ.5 లక్షలు ఫైన్
Published : Sep 2, 2024, 9:16 AM IST
5 Lakh Fine On Shankar IAS Academy For Misleading Ads :విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిన శంకర్ ఐఏఎస్ అకాడమీకి కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) రూ.5 లక్షల జరిమానా విధించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణం ఆపేయాలని ఆదేశించింది. అఖిల భారత స్థాయిలో ఎంపికైన 933మంది అభ్యర్థుల్లో 336మంది, టాప్ 100లో 40మంది, తమిళనాడు నుంచి పరీక్ష క్లియర్ చేసిన 42మంది అభ్యర్థుల్లో 37మంది దిల్లీలోని శంకర్ ఐఏఎస్ అకాడమీవారేనని, తమది దేశంలో అత్యుత్తమ అకాడమీ అని ప్రకటనలు ఇచ్చుకోవడం పట్ల ప్రాధికార సంస్థ విచారణ చేపట్టింది. 2022 యూపీఎస్‌సీ సీఎస్‌ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కేవలం 333మంది మాత్రమే అని పేర్కొంది. తప్పుడు సమాచారంతో ప్రకటనలు ఇవ్వడం మోసం చేయడమే అవుతుందని, ఇది వినియోగదారుల హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని తేల్చి చెప్పింది.