ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పంచాయతీల నిధులను జగన్ సర్కార్ దొంగిలించి దారిమళ్లిస్తోంది- సర్పంచ్​ల ఆందోళన - కేంద్ర ప్రభుత్వం పంచాయతీల నిధులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 5:26 PM IST

YSTCP Govt Diverted Sarpanch Funds in Kakinada : కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయిస్తున్న నిధులను జగన్ సర్కార్ దొంగలించి దారిమళ్లిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ. రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. సర్పంచులు, ఎంపీటీసీ (MPTC) లు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వారిని పోలీసులు ఎక్కిడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో పోలీసులకు సర్పంచులకు మధ్య తోపులాట జరిగింది. శాంతియుత నిరసనలు చేస్తున్న తమను అడ్డుకోవడమేంటని నిరసనకారులు మండిపడ్డారు. సర్పంచుల డిమాండ్లును తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్​ (Collector)కు వినతి పత్రం అందజేశారు.

Panchayati Raj Chamber President Petition To Collector On Funds : ఆందోళనకు దిగిన సర్పంచులు మాట్లాడుతూ జగన్​ ప్రభుత్వం గద్దె దిగితేనే గ్రామాలు అభివృద్ధి బాట పడతాయని అన్నారు. జగన్​ ఓడితేనే మనకు మనుగడ అంటూ పలు జిల్లాల్లో కలెక్టర్​ కార్యాలయాల ఎదుట నిరసనలు (Protest) తెలుపుతున్నామన్నారు. గ్రామాలు ఎలా నిర్వీర్యమైపోతున్నాయో తెలపడానికి ప్రజల తరుపున తాము ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details