ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలుగుదేశం నేతలపై వైఎస్సార్సీపీ మూకల దాడి - ఫ్లెక్సీ వివాదంతో దాడి చేయడానికి వచ్చారని ఆందోళన - YSRCP Mob Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 1:31 PM IST

YSRCP Mob Attack on Telugu Desam Leaders in Satya sai District : శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామస్థులపై నిన్న రాత్రి ( గురువారం) వైసీపీ మూకలు దాడికి తెగబడ్డారు. మామిళ్లపల్లి వైసీపీ నాయకుడు అమర్నాథ్​ రెడ్డి గుండాలను తీసుకొని దాడికి వచ్చారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గ్రామంలో ఫ్లెక్సీకి సంబంధించి తలెత్తిన వివాదంలో వైసీపీ మూకలు దాడి చేయడానికి వచ్చారని టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

టీడీపీ నాయకుడు దండు ఓబులేసుపై మామిళ్లపల్లి వైసీపీ నేత అమర్నాథ్​ రెడ్డి చేయడానికి యత్నించిరని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు కనబడటంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు అమర్నాథ్​ రెడ్డిని అతని అనుచరులను గ్రామం నుంచి తరిమేశారు. పోలీసులే వైసీపీ రౌడీలను వెంట తీసుకొచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు తీరుకు వ్యతిరేకంగా గ్రామస్థులు వారిపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి జారుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details