వైఎస్సార్సీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు - నామమాత్ర పదవులిచ్చి నట్టేట ముంచారు: MLC జంగా - MLC Janga Comments
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 13, 2024, 5:46 PM IST
YSRCP MLC Janga Krishnamurthy Interview : బీసీలకు పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ఆత్మగౌరవం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. కులానికో కార్పోరేషన్ ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వకపోవటం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. తనకు విప్ పదవి ఇచ్చి ప్రొటోకాల్ మాత్రం అమలు చేయటం లేదని, దీనిపై ప్రభుత్వ పెద్దల్ని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వెలిబుచ్చారు.
ఎమ్మెల్సీగా ఉన్న తన పరిస్థితి ఇలా ఇంటే మిగతా వారి పరిస్థితి ఏంటని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు. పార్టీ కోసం పని చేసిన వారిని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పట్టించుకోవటం లేదని, తనను కూడా సమావేశాలకు పిలవటం లేదని తెలిపారు. ప్రజల అభిప్రాయం మేరకే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించానని, కానీ అవకాశం రాలేదన్నారు. కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయం మేరకు త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటోన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.