ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుత్తిలో జగనన్న సభ - మద్యం షాపుల దగ్గర వైసీపీ కార్యకర్తలు - YSRCP Leaders At Liquor Shop - YSRCP LEADERS AT LIQUOR SHOP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 4:13 PM IST

YSRCP Leaders With Party Flags At Liquor Shops in Gooty : అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చేపట్టిన 'మేమంతా సిద్ధం' సభకు మేమూ సిద్ధమంటూ మందుబాబులు సమాయత్తమయ్యారు. గుత్తిలో సీఎం కార్యక్రమం ఉండగా ఆయన అక్కడికి రాక ముందే వైఎస్సార్సీపీ కార్యకర్తలు మద్యం దుకాణాల వద్దకు చేరి మద్యం లాగించారు. వైఎస్సార్సీపీ జెండాలు చేతపట్టుకుని మద్యం కొనుగోలు చేస్తూ కనిపించారు. 

ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రారంభం కాకముందే, సభకు వచ్చిన పురుషులు మద్యం దుకాణాల వైపు పరుగులు తీశారు. భోజనానికి ముందే మద్యం తాగి మద్యం మత్తులో ఊగుతున్నారు. ఇది చూసిన స్థానికి మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పోలీసులు ఉన్నా కనీసం మందు బాబులను నివారించే పరిస్థితి లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం సభ:  ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టే బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. 21 రోజుల పాటు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర కొనసాగుతుంది.

ABOUT THE AUTHOR

...view details